నీ కళ్ళు చెబుతున్నాయి… – రెండవ భాగం

మొదటి భాగంలో ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటే కను గుడ్లు పైన్ ఎడమ వైపు ఉంటాయని చెప్పుకున్నాము. ఈ రెండవ భాగానికి మళ్ళీ కొన్ని ప్రశ్నలు:

  • మీకు లెక్కలు, కూడికలు, తీసివేతలు (అదేనండీ addition, subtraction) బాగా వచ్చు కదా? అయితే ఠక్కున 239కి 367 కలిపితే ఎంతో చెప్పండి?
  • ఐశ్వర్యా రాయికి పిల్లాడు పుడితే ఎట్లా ఉంటాడు?
  • ఏనుగు ఆకాశంలో ఎగిరితే ఎట్లా ఉంటుంది?
  • మీరు ఎట్లాంటి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు?
  • హైదరాబాదులో మెట్రో రైలు వస్తే ఎట్లా ఉంటుంది?

మీ కనుగుడ్లు ఎటు వైపు వెళ్లాయో గమనించారా?

…..

అవును కనుగుడ్లు పైకి కుడి వైపునకి వెళ్ళి ఉంటాయి. ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, అబద్ధాలు చెబుతున్నప్పుడు, ఏదన్నా విషయాన్ని గురించి  కల్పించి చెబుతున్నప్పుడు, మనకి తెలియకుండానే అలా పైకి కుడి వైపునకి చూడడం జరుగుతుంది.

ఆశు కవిత్వం (అప్పటికప్పుడు ఒక కవిత/పద్యం గురించి ఆలోచించి చెప్పటం) చెప్పేటప్పుడు ఆ కవుల కళ్ళను గమనించండి. అలాగే మీ పిల్లల్లు బదికి వెళ్ళనని మారాం చేస్తున్నప్పుడు, ఏదో ఒక కుంటి సాకు చెబుతున్నప్పుడు, మీ క్రిందొ ఉద్యోగి ఇచ్చిన పనిని సక్రమంగా చేయనప్పుడు, సంజాయిషీ  ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళని గమనించండి. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు….

గమనిక : ఒక ప్రమాదం కూడా ఉన్నది. అవతలి వ్యక్తి ముందుగానే బాగా ఆలోచించి పధకం ప్రకారం అబద్దం చెప్పాలని నిశ్చయించుకుని, రెందు మూడు సార్లు rehearsal  చేసుకు వచ్చినప్పుడు పైన్ చెప్పిన విధనం పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు మనం కాస్త తెలివి ఉపయోగించి ఇట్టే గ్రహించవచ్చు. మచ్చుకకి ఒకటి ఇక్కడ చెబుతాను.
మీ సహ ఉద్యోగి ఆఫీసుకి ఆలస్యంగా వచ్చారనుకోండి, ఎందుకు ఆలస్యం అయింది అని అడిగితే, scooter టైరు పంక్చ్‌ర్ అయిందని అబద్దం చెబుతున్నట్టు అనిపిస్తే, ఈ విధంగా ఒక ప్రశ్న అడగండి : “పంక్చ్‌ర్ అయినది ఏ టైరు? (ముందుదా, వెనకదా)”.  సమాధానం ఇచ్చేటప్పుడు అతని కళ్ళని గమనించండి.

మరో విషయం అవతలి వ్యక్తి నల్ల కళ్ళజోడు (cooling glasses) పెట్టుకొని ఉంటే కనక మనం కనుక్కోవటం కష్టమే.

Comments (1)

నీ కళ్ళు చెబుతున్నాయి… – మొదటి భాగం

ఈ మధ్య నేను, మన కళ్ళను గురించి ఒక ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయాన్నిచదివాను. మన నోరు మాత్రమే కాదు, మన కళ్ళు కూడా మాట్లాడతాయి. అవతలివాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వారి కనుగుడ్ల కదలికలను బట్టి, వారు మాట్లాడుతున్నది నిజమా, అబద్ధమా అని పసి గట్టవచ్చు.

ముందుగా కొన్ని ప్రశ్నలు (ప్రశ్నలు చదివి ఒక్క నిమిషం, ఈ ప్రశ్నలకి సమాధానాలు మీ మనస్సులో చెప్పుకోండి):

  • నిన్న రాత్రి మీరు ఏ కూర తిన్నారు?
  • మీ ఇంట్లో మెత్తం గదులు ఎన్ని?
  • మీరు మొట్టమొదటి సారి తిరుపతి ఎప్పుడు వెళ్ళారు?
  • మీ చిన్నప్పటి స్కూల్ యూనిఫాం రంగు ఏది?
  • మీ చిన్ననాటి స్నేహితుల్లో పొడుగరి ఎవరు?

ఈ ప్రశ్నలకు జావాబు ఇచ్చేటప్పుడు, మీ కనుగుడ్లను పరిశీలించారా? మీరు మీక్ను గుడ్లను తప్పకుండా  పైకి ఎడమ వైపుకి తిప్పి ఉంటారు. జరిగిన ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే ముందు ఎవరైనా సరే ఇలాగే చేస్తారు. ఎవరైనా ఒక విషయం గురించి అడిగినప్పుడు వారు అది గుర్తుకు తెచ్చుకుని చెప్పినప్పుడు ఇలా చుస్తారు. అంటే నిజం చెప్తున్నారని గ్రహించవచ్చు.

పిల్లలని పాఠాలానో, లేక ఎక్కాలనో అప్ప చెప్పమనండి, వారి కను గుడ్లను పరిశీలించండి. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీ పక్క వాళ్ళని ఆడిగి, వాళ్ళ కళ్ళను పరిశీలించండి.  ఆశ్చర్యంగా ఉంది కదూ!!!!

రెండవ భాగంలో అబద్ధం చెప్పేటప్పుడో, లేక కట్టుకధ అల్లేటప్పుడో  కనుగుడ్లు ఎటు తిరుగుతాయో మాట్లాడుకుందాం…

5 వ్యాఖ్యలు

ఎన్నికలు – “None of the above”

 ఈ రోజు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా కొన్ని పార్టీలు “మేము ఎన్నికలకు దూరంగా ఉంటామని” ప్రకటించాయి. మరి కొన్ని పార్టీలు అలా ఎన్నికలకు దూరంగా ఉండటం మన్ రాజ్యాంగానికి విరుద్ధమై పేర్కొన్నాయి. ఈ వార్తలు చదువుతుండగా, నాకుఒ క సందేహం కలిగినది. మన చదువులలో, పరీక్షలలో “multiple choice questions”లలో ఒక option, “none of the above”. మరి మన ఎన్నికలలో కూడా అలాంటివే ఉండచ్చు కదా? అంటే మనకి ఏ అభ్యర్ధి నచ్చలేదు అని పేర్కొనటానికి  ఏమన్నా మార్గాలున్నాయా అనే ఆలోచన వచ్చింది. సరే గూగుల ద్వారా ఏమన్న సమాచారం దొరుకుతుందేమోనని ఒక రాయి వేశాను. ఇదిగో మన న్యాయశాఖ వెబ్ సైట్లో ఈ లంకె దొరికింది ( పైన ఇచ్చిన పుట చదవటం కొంచెం కష్టమైనా, నేను వెదుకుతున్న సమాచారం దొరికింది) : http://lawmin.nic.in/ld/subord/cer1.htm

క్లుప్తంగా ఇదీ విషయం:

49-O.   Elector  deciding  not  to  vote.-If  an  elector,  after  his electoral  roll number has been duly entered in the register of voters in  Form-17A and has put his signature or thumb impression thereon  as required  under  sub-rule (1) of rule 49L, decided not to  record  his vote,  a remark to this effect shall be made against the said entry in Form  17A  by  the  presiding  officer  and  the  signature  or  thumb impression of the elector shall be obtained against such remark.

కాబట్టి మన రాజ్యాంగం వోటు వెయ్యకుండా మన యొక్క నిర్ణయం తెలుపటానికి అవకాశం కల్పించిందని నాకు అనిపించింది.

వ్యాఖ్యానించండి

« Newer Posts · Older Posts »