వంట – మడి

మన బామ్మలు, అమ్మమ్మలు వంట చేసేటప్పుడు, మడి కట్టుకుని చెస్తారు. ఈ మడి వెనకాల కొంచెం శాస్త్రీయత కనిపిస్తున్నది. వంట చేసే ముందు స్నానం చేసి, కాస్త తడిగా ఉన్న నారు బట్ట కట్టి వంటకు ఉపక్రమిస్తారు.

స్నానం చేస్తారు కాబట్టి శుభ్రత ఉంటుంది.  ఇప్పుడంటే ఈ గ్యాస్ పొయ్యిలున్నాయి కానీ ఇంతక ముందు అంతా కట్టెల పొయ్యి ద్వారానే వంట. నారు బట్ట, అందులోను కాస్త తడిసి ఉంటొంది కాబట్టి, నిప్పు అంటుకునే అవకాశం చాలా తక్కువ.

5 వ్యాఖ్యలు »

  1. chavakiran said

    కనుక మనము ఇటువంటివన్నీ ఇప్పుడు పాటించనవసరం లేదు అని మరో ముక్క వ్రాస్తే నాలాంటి వారు కూడా సంతోషిస్తారు కదా!

  2. బహుశా కాదేమో. పరిశుభ్రత తప్పనిసరి. ఇక మిగతావాటికి వస్తే, వంటగది ఈ కాలంలో చాలా చిన్నదైపోతున్నది. ఉప్పు, పప్పు పెట్టుకునే గూళ్ళు పొయ్యికి అతి దగ్గర్లో ఉంటున్నాయి. మరి బట్టలు (nylon, polyster) మొదలగునవి చాలా త్వరగా నిప్పు అంటుకుంటాయని తెలుస్తున్నది. ఈ కారణాల దృష్ఠ్యా మడి అనేది మనకి అవసరమేమో అనిపిస్తున్నది.

  3. lalitha said

    అవన్నీ ఏమో కాని, వళ్ళు నెప్పులూ, కాళ్ళ నెప్పులూ, అరి కాళ్ళూ పగిలి బీటలు వారడం మటుకు నిజం.

    ఆచారాలు, సంప్రదాయాలు పేరుతో ఇలాంటి వాటిని సమర్థించ వద్దని మనవి. అసలు సంస్కృతి అన్న దాని అర్థమే పక్క దారి పడుతుంది. నిజంగా విలువైన వాటిని కోల్పోతాము ఇలాంటివి సమర్థించుకుంటూ కూచుంటే.

    కొన్ని అలవాట్లు అందం కోసం, కొన్ని ఆరోగ్యం కోసం ఏర్పడి ఉండ వచ్చు. అయినంత మాత్రాన ఆచారం పేరుతో చలామణి అయ్యే ప్రతిదీ అర్థవంతమైనది కాదు, ఆదినుంచీ ఉన్నదీ కాక పోవచ్చు.

  4. lalitha said

    మీరు ఈ నాటి వంటింటి కోసం చెప్పేదైనా, నూలు బట్టలు కట్టుకోమనే సలహా సరిపోతుంది.

  5. లలిత గారూ,
    మీరు చెప్పినదానితో సగం ఎకీభవి.స్తాను. నేను అన్నింటినీ సమర్దించటం లేదు. నేను గమనించిన విషయాలు నలుగురితో పంచుకుంటున్నాను. నా ఉద్దేశంలో ఆచారాలలో మంచిని గ్రహించి మరల ఉపయోగించుకోగలమా అన్నది ఆలోచించవలసిన అవసరం ఉన్నదని భావిస్తాను. ఈ మడి విషయానికే వస్తే, నూలు బట్టలు ఒక సలహా. చాలా మంది apronలు వాడుతుంటారు. నేను గమనించినంత మటుకు అవి నూలు బట్టలతో తయారు చేస్తారు. కాబట్టి అలాంటివి వాడితే సరిపోతుంది.

    నా మరో టపా ముగ్గులు గురించి:
    ముగ్గుల గురించి చాలా మంది ముగ్గులేసుకుంటే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది అంటారు. కానీ Bill Gates ఇంటి ముందు ఎటువంటి ముగ్గులు వేయలేదే అనే ఆలోచించేవాడిని. కానీ నేను టపాలో వ్రాసిన విషయం నాకు నమ్మబుద్ధిగా అనిపించింది.

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి