Chinaలో శాకాహారం తినటం ఎట్లా?

king.jpg

అది జులై 2005 సంవత్సరం. నేను అప్పుడు HP,bangalore లో పని చేస్తున్న రోజులు. Office పని మీద చైనా వెళ్ళ వలసి వచ్ఛీంది.  అంతకముందు చైనా వెళ్ళిన వారితో మాట్లాడి వాళ్ళ అనుభవాలు ద్వారా తెలిసింది ఏమిటి అంటే, అక్కడ మన భారతీయులకి ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని.  వారికి ఆంగ్లము కూడా రాదని  తెలిసింది.  జనాలు చెప్పటం అస్సలు మాసం లేనిదే అక్కడ తిండి ఉండదని. నేనేమో శాకహారిని.  office  పని వెళ్ళక తప్పదు. సరే ఇక మన M.T.R వారి  Ready To Eat, packetలు ఒక పదిహేను pack చేసుకున్నాను.

 మొత్తానికి చైనా చేరుకున్నాను. అక్కడా హోటల్‍లో దిగిన తరువాత ఒక బ్రహ్మాండమైన్ ఆలోచన వచ్చింది. అదేమిటంటే మన అహారానికి సంబంధించి ఒక menu card తయారు చేసుకుంటే ఎలాఉంటుంది అని.

పక్కనే ఉన్న నా HP-china colleagueని అడిగి నాకు కావలసినవి వారి భాషలో వ్రాయించుకున్నను. 

  • Noodles (మాంసము, గుడ్డు లేకుండా)
  • ఉడక పెట్టిన కూరగాయలు
  • టొమాటో సాస్

ఇదిగో ఈ విధంగా (పూర్తి చిత్రాల కోసం, చిత్రం పై మీ మూషికంతో కాస్త నొక్కండి):

menu1.jpg

సరే మరి ఎంత వరకూ ఉపయోగపడిందనేగా మీ ప్రశ్న. మీరే చూడండి.

soup.jpg

fried_rice.jpg

అదండీ సంగతి.  నేను ఏ హోటల్కి వెళ్ళినా, నావెంట ఈ మెనూ తీసుకువెళ్ళాను. వారికి చూపించి, ఇవి మాత్రమే కావాలని, మరియు అస్సలు మాంసం ఉండకూడదని మరీ మరీ వక్కాణించి చెప్పి ఏ మాత్రం ఇబ్బందిప్డకుందా మాంచి ఆహారం తిన్నానండీ చైనాలో.

నేను తిరిగి వచ్చిన తరువాత ఆఫీసులో ఈ ఛాయాచిత్రాలు చూపించిన తరువాత నన్ను మెచ్చుకోనివారు లేరు. ఆ పై చైనా వెళ్ళవలసిన ఇద్దరు, ముగ్గురు నా దగ్గరకొచ్చి ఈ మెనూ Xerox  తీసుకొని కూడా వెళ్లారు.

5 వ్యాఖ్యలు »

  1. radhika said

    అక్కడ మెనూ లో రాసింది చదవగలిగే అంత జ్ఞానం వున్నవాళ్ళకి మనం చెప్పేది అర్దం కాదంటారా?[ఇందులో వెటకారం లేదని,నిజం గా తెలియకే అడుగుతున్నానని గమనించగలరు] మహారాజా సూట్ లో మాత్రం భలే వున్నారు.

  2. మీరు పూర్తి చిత్రం చూసినట్టు లేరు. చిత్రం పైన click చేస్తే పూర్తి చిత్రం కనబడుతుంది. అక్కడ కుడి వైపు చైనీస్ (వారి భాషలో వ్రాసి ఉన్నది). అక్కడి వారు చైనీస్ వ్రాయగలరు, చదవగలరు కానీ ఆంగ్లము రాదు (Five star hotelలో వాళ్ళకి కూడా ఆంగ్లము సరిగ్గా రాదు). మనకేమో చైనీస్ రాదు.

  3. mee sankalpaaniki jOhaarlu

    manasu unTE maargam unTundi anna daanni nijam chEsaaru

  4. వేణు said

    మీ కథ చదివిన తరువాత మా పంతులు (ప్రసాద్) గుర్తుకొచ్చాడు వెంటనే….తను మాత్రం పుర్తిగా మారిపోయివచ్చాడు. ఇప్పుడు ఆదివారం వస్తే భయం వేస్తోంది, వాడు వచ్చి మొత్తం చికెన్ ఎక్కడ లాగించేస్తాడేమోనని…

  5. శాకాహరం గురించి తెలుగు గూగులమ్మలో వెతుకుతుంటే నాకు మీ బ్లాగు కనపడి ఇక్కడికి వచ్చాను. మీ సంకల్ప బలం గొప్పది. మేమైతే ( పురోహితులమైతే ) మా వంట సరుకులు పట్టు కు వెళ్లి వండుకునే వారమేమో. ఎన్ని రోజులైనా సరే ముందు ఆ ఏర్పాటు చేసుకునే కదులుతాము.

RSS feed for comments on this post · TrackBack URI

వ్యాఖ్యానించండి