Archive for Uncategorized

పసి పిల్లలకు చదవడం నేర్పించటం ఎలా?

పైన ఉన్న మా రెండున్నర ఏళ్ళ వయసు గల మా అబ్బాయి సోహం రాజా వీడియో చూడండి. వీటిని నేపించటానికి మేము glenn doman flash card పద్ధతి ఉపయోగించాము.  మరిన్ని వివరాలు వచ్చే టపాలో…

3 వ్యాఖ్యలు

పసి పిల్లలకే మీసాలుంటే…..

వ్యాఖ్యానించండి

నీ కళ్ళు చెబుతున్నాయి… – రెండవ భాగం

మొదటి భాగంలో ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటే కను గుడ్లు పైన్ ఎడమ వైపు ఉంటాయని చెప్పుకున్నాము. ఈ రెండవ భాగానికి మళ్ళీ కొన్ని ప్రశ్నలు:

  • మీకు లెక్కలు, కూడికలు, తీసివేతలు (అదేనండీ addition, subtraction) బాగా వచ్చు కదా? అయితే ఠక్కున 239కి 367 కలిపితే ఎంతో చెప్పండి?
  • ఐశ్వర్యా రాయికి పిల్లాడు పుడితే ఎట్లా ఉంటాడు?
  • ఏనుగు ఆకాశంలో ఎగిరితే ఎట్లా ఉంటుంది?
  • మీరు ఎట్లాంటి ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారు?
  • హైదరాబాదులో మెట్రో రైలు వస్తే ఎట్లా ఉంటుంది?

మీ కనుగుడ్లు ఎటు వైపు వెళ్లాయో గమనించారా?

…..

అవును కనుగుడ్లు పైకి కుడి వైపునకి వెళ్ళి ఉంటాయి. ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, అబద్ధాలు చెబుతున్నప్పుడు, ఏదన్నా విషయాన్ని గురించి  కల్పించి చెబుతున్నప్పుడు, మనకి తెలియకుండానే అలా పైకి కుడి వైపునకి చూడడం జరుగుతుంది.

ఆశు కవిత్వం (అప్పటికప్పుడు ఒక కవిత/పద్యం గురించి ఆలోచించి చెప్పటం) చెప్పేటప్పుడు ఆ కవుల కళ్ళను గమనించండి. అలాగే మీ పిల్లల్లు బదికి వెళ్ళనని మారాం చేస్తున్నప్పుడు, ఏదో ఒక కుంటి సాకు చెబుతున్నప్పుడు, మీ క్రిందొ ఉద్యోగి ఇచ్చిన పనిని సక్రమంగా చేయనప్పుడు, సంజాయిషీ  ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళని గమనించండి. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు….

గమనిక : ఒక ప్రమాదం కూడా ఉన్నది. అవతలి వ్యక్తి ముందుగానే బాగా ఆలోచించి పధకం ప్రకారం అబద్దం చెప్పాలని నిశ్చయించుకుని, రెందు మూడు సార్లు rehearsal  చేసుకు వచ్చినప్పుడు పైన్ చెప్పిన విధనం పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు మనం కాస్త తెలివి ఉపయోగించి ఇట్టే గ్రహించవచ్చు. మచ్చుకకి ఒకటి ఇక్కడ చెబుతాను.
మీ సహ ఉద్యోగి ఆఫీసుకి ఆలస్యంగా వచ్చారనుకోండి, ఎందుకు ఆలస్యం అయింది అని అడిగితే, scooter టైరు పంక్చ్‌ర్ అయిందని అబద్దం చెబుతున్నట్టు అనిపిస్తే, ఈ విధంగా ఒక ప్రశ్న అడగండి : “పంక్చ్‌ర్ అయినది ఏ టైరు? (ముందుదా, వెనకదా)”.  సమాధానం ఇచ్చేటప్పుడు అతని కళ్ళని గమనించండి.

మరో విషయం అవతలి వ్యక్తి నల్ల కళ్ళజోడు (cooling glasses) పెట్టుకొని ఉంటే కనక మనం కనుక్కోవటం కష్టమే.

Comments (1)

Older Posts »