ముగ్గులు – సునామీ

మనవాళ్ళు ఇళ్ళ ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు అనే దాని గురించి కొన్ని నెలల క్రితం టీ.వి చానల్‍లో (బహుశా డిస్కవరీ అనుకుంటా) ఒక కార్యక్రంఅం చూశాను . పాత కాలంలో ముగ్గు బియ్యపు పిండి వెసేవారట. (కానీ ఇప్పుడు సున్నంతో వేస్తున్నారనుకోండి). పొద్దున వేసిన ముగ్గు సాయంత్రాని కల్లా పురుగులు, చీమలు తినేస్తాయిట. అలా జరగని పక్షంలో ఏదో ప్రకృతి వైపరీత్యం సంభవించబోతున్నదని సంకేతమట. ఆ విధంగా మన వాళ్ళు జంతువుల యొక్క శక్తిని ఉపయోగించుకునేవారట.

మరి జంతువులు ముందే పసి గట్టగలవా? అది ఎంత వరకు నిజం. December 26th 2004 న వచ్చిన సునామీ వల్ల ,  భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా , జంతు నష్టం మటుకు  తక్కువట. కొన్ని ఏనుగులు ముందే పసిగట్టి కొండలమీదకెళ్ళి ప్రాణం రక్షించుకున్నాయిట.  కాబట్టి కొంతవరకు పైన చెప్పిన విషయం నమ్మబుద్దిగానే అనిపించింది.

References:

 http://findarticles.com/p/articles/mi_qn4188/is_20050111/ai_n11503538

http://www.sea-user.org/news-detail.php?news_id=1289

http://news.bbc.co.uk/1/hi/sci/tech/4381395.stm

(search elephant in the above)

1 వ్యాఖ్య »

  1. భాస్కర్ చెప్పబడిన

    బ్రదరూ!!
    అలా పురుగులకీ చీమలకి పిలిచి బువ్వ పెట్టే పని ఐతే ఒక బియ్యపు పిండి కుప్పలానో లేక ముద్దలానో పెట్టొచుకదా, నడుములు విరిగేల వంగుని మరీ ముగ్గు వెయ్యాల్సిన అవసరం ఉందా?

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి