బధ్రపరచినది జులై 8, 2007

పసి పిల్లల ఏడుపు

నిన్నా ఈనాడు పత్రికలో ఒక వ్యాసం చూశాను. అది పిల్లల పెంపకం గురించి.

 పిల్లలు ఏడుస్తూ ఉంటే, మన పెద్దవాళ్ళు కాసేపు అలాగే ఏడవనీయమంటారు. ఏడుపు బలమని, జీర్ణశక్తి పెరుగుతుందని, …. రకరకాలుగా చెబుతారు (బాలానాం రోదనం బలమని). కొంతమందేమో ఏడ్చిన వెంటనే ఎత్తుకుంటే పిల్లలు గారాబం నేర్చుకుంటారని, ఎప్పుడూ ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటారనీ భావించి కాసేపు ఏడవనిస్తారు.

కానీ పిల్లల మానసిక నిపుణుల ప్రకారం, పిల్లలు ఏడవగానే మనం స్పందించి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుని ఆ సమస్య పరిష్కరిస్తూంటే…. అలాంటి పిల్లలు తక్కువ ఏడుస్తారట.

పట్టించుకోకుండా ఏడవనియ్యమని వదిలేస్తే వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారని, అది మంచి అలవాటు కాదని నిపుణుల సూచన.

ఇలా పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏడవనీయకుండా మనం బాగా పట్టించుకుంటే పిల్లల్లో స్వతంత్ర భావం త్వరగా పాదుకుంటుంది. మన గురించి పట్టించుకుంటున్నారన్న నమ్మకం కలిగాక పిల్లల్లో భద్రతాభావం నెలకొంటుంది. ధైర్యంగా తప్పటడుగులు వేస్తూ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారు. పెద్దయ్యాకకూడా వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

  

అభిప్రాయములు (1 )